ఆరు నెలలుగా చెరకు బిల్లులు చెల్లించకుండా చక్కెర కర్మాగార యాజమాన్యం కాలయాపన చేస్తుందంటూ చక్కెర రైతులు ఆందోళనకు దిగారు. తిరుపతికి చెందిన చక్కెర రైతులు మయూర చక్కెర కర్మాగారానికి ఒప్పందం ప్రకారం చెరకును సరఫరా చేసేవారు. గత ఆరు నెలలుగా బకాయిలు చెల్లించకుండా యాజమాన్యం రైతులకు సరైన సమాధానం చెప్పకుండా ఉండిపోవటంతో విసుగెత్తిన రైతులు కర్మాగారానికి చెందిన మయూర హోటల్ ఎదుట ధర్నాకు దిగారు. ఆరు నెలలకు మూడు కోట్ల రూపాయల పాత బకాయిలు వెంటనే చెల్లించాలని, లేకపోతే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని రైతులు తెలిపారు.
ఇదీ చదవండి: పొలాల్లోకి ఏనుగులు.. పూర్తిగా ధ్వంసమైన పంటలు