ETV Bharat / state

'సంక్షేమ పథకాలు అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి' - తిరుపతిలో ఉన్నతాధికారుల​తో సబార్డినెంట్ లెజిస్లేషన్ కమిటీ ఛైర్ పర్సన్ సమావేశం

సంక్షేమపథకాలన్నింటినీ సమర్థవంతంగా అమలు చేసేలా శాఖాధికారులు బాధ్యత తీసుకోవాలని సబార్డినెంట్ లెజిస్లేషన్ కమిటీ ఛైర్ పర్సన్ పామిడి శమంతకమణి ఆదేశించారు.

తిరుపతిలో ఉన్నతాధికారుల​తో సబార్డినెంట్ లెజిస్లేషన్ కమిటీ ఛైర్ పర్సన్ సమావేశం

author img

By

Published : Feb 26, 2020, 6:33 PM IST

తిరుపతి పద్మావతి అతిథిగృహంలో జిల్లా ఉన్నతాధికారులతో సబార్డినెంట్ లెజిస్లేషన్ కమిటీ ఛైర్ పర్సన్ పామిడి శమంతకమణి సమావేశమయ్యారు. ప్రభుత్వ పథకాలు అమలవుతున్న తీరుపై అధికారులతో చర్చించారు. సంక్షేమపథకాలన్నింటినీ సమర్థవంతంగా అమలు చేసేలా శాఖాధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా, జిల్లాలోని పలు విభాగాల శాఖాధిపతులకు ఆదేశాలు జారీ చేశారు. కాంట్రాక్ట్ పనుల్లో మహిళలు ఆశించినంతమేర లేరన్నారు. 50శాతం రిజర్వేషన్ల అమలును క్షుణ్నంగా పరిశీలిస్తున్నామన్నారు. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల వ్యవస్థ, నాడు-నేడు పనులు, నరేగా నిధుల అనుసంధానం వంటి విషయాలపై ఎప్పటికప్పుడు జిల్లాస్థాయి సమావేశాలను నిర్వహించాలని సూచించారు. ఏవైనా సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు.

తిరుపతిలో ఉన్నతాధికారుల​తో సబార్డినెంట్ లెజిస్లేషన్ కమిటీ ఛైర్ పర్సన్ సమావేశం

ఇవీ చదవండి

యాచకులకు అమ్మ ఒడి సేవలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.