చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శ్రీ పద్మావతి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నుంచి ఐదుగురు విద్యార్థినులు ప్రతిభా పురస్కారాలకు ఎంపికయ్యారు. 2019 మార్చిలో జరిగిన పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరచినందుకు ఈ పురస్కారాలు దక్కాయి. పి.హర్షిత, ఎన్. లలితాంబ, యూ. ధనశ్రీ , ఎం. చందన, ఎం. సంధ్యారాణి ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ ఘనతపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి మరెన్ని సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: