ఇసుకను ప్రైవేట్ పరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీవో కార్యాలయాల వద్ద ఆందోళనలు చేయనున్నట్లు భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి తెలిపారు. ప్రైవేట్ వ్యక్తులకు లాభాలు చేకూర్చేందుకే సీఎం జగన్... నష్టాల్లో ఉన్న ఓ సంస్థకు ఇసుక టెండర్ ను కట్టబెట్టించారని ఆరోపించారు.
మధ్య తరగతి, పేద ప్రజల జీవితాలతో చెలగాటమాడేలా ఇసుక, సిమెంట్, మద్యం అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం కోట్లరూపాయలు సంపాదించే ప్రయత్నం చేస్తోందన్నారు. తక్షణమే ఇసుక టెండర్లను రద్దు చేయని పక్షంలో ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చదవండి: