రోజురోజుకు కరోనా తీవ్రత పెరుగుతుండడంతో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయ దర్శన వేళలు మార్పు చేశారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతి ఇచ్చే దిశగా చర్యలు చేపట్టారు. రాహు కేతు సర్ప దోష నివారణ పూజలు మినహా మిగతా ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో పెద్దరాజు తెలిపారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా ఉన్న ముత్యాలమ్మ ఆలయంలో ఈ ఏడాది ఏకాంతంగా వార్షిక జాతరను నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: కరోనా ఎఫెక్ట్: అత్యవసర సేవల మినహా.. అన్ని కార్యకలాపాలు బంద్!