మోహినీ అవతారంలో శ్రీనివాసుడు
మోహినీ అవతారంలో దర్శనమిచ్చిన శ్రీనివాసుడు - sri venkateshwaraswami in the form of Mohini
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఐదో రోజున మోహినీ అవతారంలో శ్రీనివాసుడు భక్తులకు దర్శనమిచ్చారు. మోహినీ అవతారంలో పల్లకిలో తిరుచ్చిపై వెన్నముద్ద కృష్ణుడిగానూ తిరుమాఢ వీధుల్లో భక్తులకు కనువిందు చేశాడు. భక్తుల చెక్క భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు భక్తులకు అభయమిచ్చారు.
![మోహినీ అవతారంలో దర్శనమిచ్చిన శ్రీనివాసుడు sri venkateshwaraswami in the form of Mohini](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6122195-1093-6122195-1582096878388.jpg?imwidth=3840)
ముగ్ధమనోహర మోహిని రూపంలో శ్రీనివాసుడు