ETV Bharat / state

US POSTAL STAMPS: అలా తీసిన అరుదైన ఛాయాచిత్రాలు.. యూఎస్ పోస్టల్ స్టాంప్స్​ - అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ - నాసా సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ

సౌర కుటుంబానికి అధిపతి.. సూర్యుడిని నేరుగా మనం ఎంత సేపు చూడగలం? స్వయంగా ఓ నక్షత్రమై.. సుమారు 5 వేల 600 సెల్సియస్ ఉపరితల ఉష్ణోగ్రతతో భగభగమండే భానుడిలో జరిగే మార్పులను మానవ నేత్రంతో పరిశీలించాలంటే సాధ్యమయ్యే పనేనా? ఎంతో క్లిష్టతరమైన ఈ వ్యవహారాన్ని ఛేదించి.. సౌర కుటుంబానికే ప్రథముడు.. సూర్యుడిని సునిశితంగా పరిశీలించాలనే ఉద్దేశంతో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ - నాసా సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీని ప్రారంభించింది. ఈ స్పేస్ క్రాఫ్ట్ అబ్జర్వేటరీ పరిశోధనలు ప్రారంభమై 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అబ్జర్వేటరీ నుంచి తీసిన అరుదైన సూర్యుడి చిత్రాలతో తాజాగా యూఎస్ పోస్టల్ సర్వీస్ ప్రత్యేక పోస్టల్ స్టాంప్​లను విడుదల చేసింది.

POSTAL
POSTAL
author img

By

Published : Jun 20, 2021, 3:52 PM IST

మనం జీవిస్తున్న భూమి సహా మరో ఏడు గ్రహాలు.. ప్లూటో, మేక్ మేక్, ఎరిస్, సెరిస్ వంటి మరుగుజ్జు గ్రహాలు, కొన్ని వేల తోక చుక్కలు, కోట్లాది ఆస్ట్రరాయిడ్స్​కి ఆలవాలం సౌర కుటుంబం. స్వయం ప్రకాశిత నక్షత్రమైన సూర్యుడి ఆధారంగా ఏర్పడిన ఈ సౌర కుటుంబంలో జరుగుతున్న మార్పులను గడచిన కొన్ని ఏళ్లుగా భూమి, దాని ఉపరితలం కేంద్రంగా శాస్త్ర విజ్ఞాన ప్రపంచం గమనిస్తూ వస్తోంది. ప్రత్యేకించి ఈ కుటుంబానికి కేంద్రకంగా, ఆధార సూత్రంగా నిలుస్తోన్న సూర్యుడిలో జరిగే మార్పులను గమనించటం అత్యంత ఆవశ్యకత కలిగిన విషయమైనా.. సూర్యుడిపైన ఉండే అత్యధిక ఉష్ణోగ్రత, సోలార్ ఫ్లేర్స్​గా పిలుచుకునే ఆకస్మిక మార్పులు, ఉద్గారాల కారణంగా చాలా ఏళ్ల వరకూ సాధ్యం కాని వ్యవహారంగా మిగిలిపోయింది.

నడుం బిగించిన నాసా..

ప్రస్తుత కాలంలో అత్యాధునిక సాంకేతికత శరవేగంగా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ - నాసా ఇందుకు నడుం బిగించింది. సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ పేరుతో ఓ పరిశీలన, పరిశోధకశాలను సైతం ఏర్పాటు చేసి ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన ఓ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా నిత్యం సూర్యుడిలో జరుగుతున్న మార్పులను శాస్త్రవేత్తలు, నిపుణులు పరిశీలిస్తూ వస్తున్నారు.

అంతరిక్షంలో సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ..

2010 ఫిబ్రవరి 11న అట్లాస్ 5 వాహక నౌక ద్వారా సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీని అంతరిక్షంలో ప్రవేశపెట్టారు. అప్పటినుంచి భూ ఉపరితల కక్ష్యలో తిరుగుతూ.. సూర్యుడి పనితీరు, ఉష్ణోగ్రత మార్పులు, సూర్యకాంతి, ఉష్ణోగ్రత ఆధారంగా భూమిపై చోటు చేసుకుంటున్న మార్పులు వీటి పనితీరుపై అధ్యయనాన్ని సాగిస్తోంది. అట్మాస్పియరిక్ ఇమేజింగ్ అసెంబ్లీ, హీలియోసెసిమిక్ మాగ్నటిక్ ఇమేజర్, ఈయూవీ వేరియబులిటీ ఎక్స్​పెరిమెంట్ ప్రధాన విధులుగా అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతికత సాయంతో దశాబ్ద కాలంగా సూర్యుడిని అనుక్షణం గమనిస్తూ చోటు చేసుకుంటున్న మార్పులను నాసాకు అందజేస్తోంది.

అన్నింటిపై విశ్లేషణ..

ఈ అబ్జర్వేటరీ ఇప్పటివరకూ కొన్ని మిలియన్ల ఫోటోలు, వీడియోలు తీసి అందిస్తున్న డేటా ఆధారంగా నాసా శాస్త్రవేత్తలు సూర్యుడి ఉపరితలంపై మార్పులతో పాటు.. అంతర్గతంగా చోటు చేసుకుంటున్న పరిణామాలను సైతం విశ్లేషిస్తున్నారు. ప్రత్యేకించి భానుడి అయస్కాంత క్షేత్రం, హాట్ ప్లాస్మా, సోలార్ కొరోనా, బలమైన సౌరగాలులు తదితర అంశాలపై అలుపెరగని అధ్యయనాలను అందిస్తూనే ఉంది.

అత్యంత అరుదైన ఛాయాచిత్రాలే యూఎస్ పోస్టల్

దశాబ్దకాలంగా అలా తీసిన అత్యంత అరుదైన పది ఛాయాచిత్రాలను పోస్టల్ స్టాంపులుగా మార్చి యూఎస్ పోస్టల్ సర్వీస్ తాజాగా విడుదల చేసింది. 2010 నుంచి ఇప్పటివరకూ వేర్వేరు సందర్భాల్లో తీసిన కొరోనల్ హోల్, కొరోనల్ లూప్స్, యాక్టివ్ సన్, ప్లాస్మా బ్లాస్ట్, సన్ స్పాట్స్, సోలార్ ఫ్లేర్స్ వంటి ఆకర్షణీయ, అరుదైన చిత్రాలను విడుదల చేసిన యూఎస్ పోస్టల్ సర్వీస్.. అబ్జర్వేటరీ శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని ప్రశంసించింది.

ఈ పోస్టల్ స్టాంపుల ద్వారా భావితరాలకు అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తిని కలిగించటంతో పాటు.. చిన్నారుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు వీలవుతుందని యూఎస్ పోస్టల్ సర్వీసెస్ ప్రకటించింది. ఆ అరుదైన ఫోటోలను మీరూ ఓ సారి చూసేయండి. నాసా సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ గురించి మరిన్ని వివరాలు, విశేషాలు తెలుసుకునేందుకు https://sdo.gsfc.nasa.gov/ ఈ లింక్ ద్వారా ఎస్డీవో వెబ్ సైట్​ను విజిట్ చేయండి.

ఇవీ చూడండి:

అమరావతి ఉద్యమం... 550వ రోజుకు చేరుకున్న పోరాటం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.