ETV Bharat / state

నాగుపాము హల్‌చల్‌.. భయంతో పరుగులు తీసిన జనం - latest news in thirupathi

తిరుపతిలో నాగుపాము హల్‌చల్‌ చేసింది. ఓ స్కూటీ నుంచి బయటకొచ్చి ప్రజలను ఆందోళనకు గురి చేసింది. దీంతో ప్రజలు రోడ్డు వెంబడి పరుగులు తీశారు.

Snake Halchal
నాగుపాము హల్‌చల్‌
author img

By

Published : Sep 10, 2021, 5:00 PM IST

నాగుపాము హల్‌చల్‌

తిరుపతి నగరం నడిబొడ్డున ఓ నాగు పాము బుసలు కొట్టడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. నగరపాలక సంస్ధ కార్యాలయం సమీపంలోని ద్విచక్రవాహనం లోంచి బయటపడిన నాగుపాము రోడ్డు వెంబడి పరుగులు తీయటంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. రోడ్డుపై నుంచి ఆ పాము ఓ దుకాణంలోకి వెళ్లి తిష్ట వేసింది. స్థానికులు వెంటనే పాములు పట్టడంలో నిపుణుడైన తితిదే ఉద్యోగి భాస్కర్ నాయుడుకు సమాచారం అందించారు. ఆయన వచ్చి ఆ పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

దీ చదవండీ.. TO-LET BOARDS : విజయవాడలో భారీగా 'టులెట్' బోర్డులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.