చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం అప్పిగానిపల్లిలో వ్యక్తిని గ్రామస్థులు కొట్టి చంపిన కేసులో ఆరుగురు వ్యక్తులు అరెస్టు అయ్యారు. ఈ నెల 28న గురుమూర్తి అనే వ్యక్తి గ్రామంలోని 60 ఏళ్ల వృద్ధురాలిపై దాడి చేసి చెవి కమ్మలు లాక్కొని తీవ్రంగా గాయపరిచాడు. అత్యాచారానికి యత్నించబోయాడు.
గమనించిన గ్రామస్థులు నిందితుడిని పట్టుకుని చెట్టుకు కట్టి దేహశుద్ధి చేశారు. తలపై బండరాయితో కొట్టిన కారణంగా.. గురుమూర్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ హత్య కేసులో ఆరుగురిని అరెస్టు చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చదవండి:
వృద్ధురాలిపై వ్యక్తి అత్యాచార యత్నం .. బండరాయితో కొట్టి హతమార్చిన గ్రామస్థులు