తమిళనాడు నుంచి ఆంధ్రాకు అక్రమంగా రవాణా చేస్తున్న మద్యాన్ని వాహన తనిఖీల్లో పోలీసులు పట్టుకున్నారు. చిత్తూరు జిల్లా నగరిలోని తడుకుపేట చెక్‌పోస్టు వద్ద ఓ కారులో 18 మద్యం సీసాలను పోలీసులు గుర్తించారు. ఈ విషయమై.. దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఘటనలో.. నగరి మండలంలోని తెరణి, సత్యవాడ చెక్‌పోస్టుల వద్ద రెండు స్కూటర్లపై మద్యం తీసుకొస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో.. ఎస్పీ సెంథిల్ ఆదేశాల మేరకు తమిళనాడు నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నట్లు నగరి సీఐ తెలిపారు. మొత్తం 175 మద్యం సీసాలు, ఒక కారు, రెండు బైక్‌లు సీజ్ చేసి.. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
ఇదీ చదవండి: