"అడవులు వృద్ధి చెందాలంటే విత్తనం పడాల్సిందే" చిత్తూరు జిల్లా పీలేరు పట్టణ శివారులోని బోడుగుట్టల్లో 20 లక్షల విత్తనాలను చల్లారు. ప్రముఖ ప్రకృతి వ్యవసాయ నిపుణులు బోదుషా వలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో భారీ సంఖ్యలో విత్తనాలను వేశారు. ఇందులో వేప, కానుగ, సుబాబుల్, శ్రీగంధం, ఎర్రచందనం, గుల్మొహర్ వంటి అటవీ వృక్షాల విత్తనాలను వెదజల్లారు. ఈ కార్యక్రమంలో అటవీ, ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులతో పాటు పలు కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు.
ఇదీ చూడండి:
అలిగావా చిట్టి చిలకా!... దిగిరావా నేలవంకా?