చిత్తూరు జిల్లాలో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో భారీగా కురిసిన వర్షాలకు.. చాలా ప్రాంతాల్లో రహదారులు కోతకు గురయ్యాయి. పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని సోమల మండలం దేవలకుప్పం, పెద్ద ఉప్పరపల్లి అటవీ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. సీతమ్మ చెరువు వంక ఉధృతంగా ప్రవహించగా.. ఆ మార్గంలో వంతెన తెగిపోయింది.
రహదారి దెబ్బతిని రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గార్గేయ నది ఉద్ధృతంగా ప్రవహించింది.డంతో బోనమంద, రెడ్డి వారి పల్లి, చిన్న కాంపల్లి, దళితవాడ.. గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలమనేరు నియోజకవర్గం వి. కోట మండలంలో రహదారులు కోతకు గురయ్యాయి. వి.కోట నుంచి తమిళనాడు వెళ్లే రహదారి తెగింది. బంగ్లా ఊరు వద్ద రోడ్డు పూర్తిగా చెడిపోయింది. తమిళనాడుకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఇదీ చదవండి:
Chalo Thadepalli: పోలీసు దిగ్బంధంలో తాడేపల్లి.. భారీ బందోబస్తు