చిత్తూరు జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణ పనుల్లో జరుగుతున్న జాప్యం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోందని చిత్తూరు కలెక్టర్ ఎన్. భరత్ గుప్తా అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రహదారి భద్రతా కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. రహదారుల నిర్మాణాలు మందకొడిగా సాగుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారి విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ...అలసత్వం వహించే గుత్తేదారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లా వ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారుల్లో 63 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయని ఆయా ప్రాంతాల్లో వాహన చోదకులు మరింత అప్రమత్తంగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. సమావేశంలో రవాణా శాఖ సహాయ కమిషనర్ బసిరెడ్డి, పంచాయతీ రాజ్ ఎస్ఈ అమరనాథ్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి