ETV Bharat / state

ఓ వైపు రోడ్డు ప్రమాదాలు..మరో వైపు వీధిన పడుతున్న కుటుంబాలు - రోడ్డు ప్రమాదం

ఒకరి నిర్లక్ష్యం.. .ఓ కుటుంబాన్ని వీధినా పడేస్తోంది. ఎంతో భవిష్యత్ ఉన్న చిన్నారులతో సహా..కుటుంబ మొత్తం కన్నీటికష్టాల కడలిలో మగ్గిపోతున్నారు. అతివేగం ప్రమాదం అని తెలిసినా..అలానే దూసుకెళ్తూ మనుషుల, జంతువుల ప్రాణాలను తీస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రమాదాలలో నిత్యం ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ..హెల్మెట్లు, సీటు బెల్టులపెట్టుకోక అత్యధికంగా మరణిస్తే...ట్రాఫిక్ నిబంధనలు పాటించక మరికొంతమంది అసువులు బాస్తున్నారు.

road accidents in the state
రోడ్డు ప్రమాదాలు
author img

By

Published : Aug 1, 2021, 2:19 PM IST

రాష్ట్రంలో నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాలలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించక పోవడంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇంటి యజమాని మరణించడంతో.. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి ఆత్మహత్యలు చేసుకున్న వారెందరో..! ఇలాంటి ప్రమాదాల వల్ల తల్లితండ్రులకు గర్భశోకం మిగులుతోంది. ఆసుపత్రికి, పాఠశాలలు, వ్యాపారం, ఉద్యోగం, పెళ్లిళ్లకు వెళ్లూ..ప్రమాదవశాత్తు విగతజీవులుగా మారుతున్నారు. ఇలా రోజూ మరణిస్తున్నా... వేగాన్ని మాత్రం ఆపట్లేదు. అవగాహన కార్యక్రమాలు చేపట్టినా...అంతంతమాత్రంగానే వింటున్నారు. ప్రమాదాలలో మరణిస్తున్నారు.

పక్షవాతానికి మందు తీసుకోవడానికి వచ్చి..తిరుగు ప్రయాణంలో!

కర్నూలు జిల్లా పాణ్యం మండలం సుగాలి మిట్ట సమీపంలో జాతీయ రహదారిపై... కారు లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా... మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తెలంగాణ రాష్ట్రం రాజోలికి చెందిన సంజమ్మ భర్త కేశాలుకు పక్షవాతం మందు తీసుకోవడానికి.... కారులో నంద్యాల సమీపంలోని ఉమాపతి నగర్​కు వచ్చారు. తిరిగి రాజోలుకి వెళ్తున్న సమయంలో..రహదారిపై నిలిచి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంజమ్మ మృతిచెందగా...భర్త కేశాలకు, డ్రైవర్ బిసన్నకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కావడంతో ...కారులో ఇరుక్కున్న డ్రైవర్ను బయటకు తీయడానికి దాదాపు గంటన్నర సమయం పట్టింది.

శునకం అడ్డు రావడంతో

కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో ప్రమాదం జరిగింది. ఆస్పరి నుంచి ఆలూరు వెళ్లే రహదారిలో రైల్వే గేట్ సమీపంలో ... శునకం అడ్డు రావడంతో కారు బోల్తా పడింది. బళ్లారి నుంచి హైదరాబాద్​కు వెళ్తుండగా... ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందులో షబ్బీర్ అనే వ్యక్తి మృతి చెందగా... ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను.. ఆసుపత్రికి తరలించారు.

పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లేందుకు వచ్చి..

చిత్తూరు జిల్లా పీలేరు సమీపంలో మఠంపల్లి గ్రామానికి చెందిన వరుణ్... చంద్రగిరి మండలం అగరాలలోని తన బంధువుల ఇంటికి వచ్చాడు. వరుసకు చెల్లెలైన ద్రాక్షాయిణిని తిరుపతిలో పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లేందుకు.. ఆదివారం ఉదయం బైకుపై బయలుదేరాడు. పూతలపట్టు - నాయుడుపేట జాతీయ రహదారిపై పేరూరు వద్దకు చేరుకోగానే.. గుర్తుతెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. ఈ ఘటనలో వరుణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్వల్ప గాయాలైన ద్రాక్షాయిణిని.... స్థానికులు 108 వాహనంలో తిరుపతి రుయా హాస్పిటల్ కు తరలించారు. ఎంఆర్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి. కృష్ణానదికి పోటెత్తుతున్న వరద... ముంపు ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.