చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కా తమ్ముళ్లు మృతిచెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాజులమండ్యం పోలీసులు తెలిపిన ప్రకారం.. తమిళనాడు రాష్ట్రం కాంచీపురం ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు.
శ్రీవారి దర్శనానంతరం తిరిగి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా.. టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు. రెండు సంవత్సరాల పాపకు తీవ్ర గాయాలవ్వటంతో.. తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: