చిత్తూరు జిల్లా పాకాల మండల పరిధిలోని జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొన్నాయి. చిత్తూరు నుంచి రేణిగుంటలో లోడింగ్ కోసం వస్తున్న లారీని.. తిరుపతి వైపు నుంచి చిత్తూరు వెళ్తున్న కంటైనర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో లారీ ముందు బాగం మొత్తం ధ్వంసం కావటం వల్ల డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో గాయపడిన లారీ డ్రైవర్ రఘును మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పాకాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి...