చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూతలపట్టు - నాయుడుపేట జాతీయ రహదారిపై తొండవాడ వద్ద.. ముందు వెళుతున్న లారీని, కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని108లో తిరుపతి రుయాకి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు చంద్రగిరి, కొత్తపేటకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై మూడు కిలోమీటర్ల మేర రాకపోకలు స్తంభించిపోవటంతో చంద్రగిరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
పూతలపట్టు - నాయుడుపేట జాతీయ రహదారిపై ప్రమాదం - chittoor district crime news
పూతలపట్టు - నాయుడు పేట జాతీయ రహదారిపై చిత్తూరు జిల్లా చంద్రగిరి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని ఓ కారు ఢీకొనటంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూతలపట్టు - నాయుడుపేట జాతీయ రహదారిపై తొండవాడ వద్ద.. ముందు వెళుతున్న లారీని, కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని108లో తిరుపతి రుయాకి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు చంద్రగిరి, కొత్తపేటకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై మూడు కిలోమీటర్ల మేర రాకపోకలు స్తంభించిపోవటంతో చంద్రగిరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీచదవండి: అరణియార్.. రైతన్నల ఆర్తి తీర్చేడెప్పుడు..?