తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో రెసిడెంట్ వైద్యులు ఆందోళనకు దిగారు. సుదీర్ఘ కాలంగా ఉపకారవేతనాలు పెంచాలంటూ ఆందోళన చేస్తున్నా.. తమ అభ్యర్థనను ప్రభుత్వం వినిపించుకోని కారణంగా ఆందోళనలను చేపట్టినట్లు రెసిడెంట్ వైద్యులు తెలిపారు. బుధవారం విధులు ముగిసిన తర్వాత నల్లబ్యాడ్జీలతో ఆందోళన చేసిన వైద్యులు.. గురువారం నుంచి నాన్-కొవిడ్ విధులను బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం తమ అభ్యర్థనలను పట్టించుకోని పక్షంలో ఆందోళలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను కలిసిన ఏపీ బార్ కౌన్సిల్ ఛైర్మన్, సభ్యులు