ETV Bharat / state

వ్యక్తి అనుమానాస్పద మృతి... బాధితుల ఆందోళన - relatives

పుత్తూరుకు చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. బంధువులు రహదారిపై మృతదేహంతో బైఠాయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

వ్యక్తి అనుమానాస్పద మృతి
author img

By

Published : Jun 19, 2019, 7:57 PM IST

వ్యక్తి అనుమానాస్పద మృతి
చిత్తూరు జిల్లా పుత్తూరు చెందిన ఓ వ్యక్తి మరణం.. ఉద్రిక్తతకు దారి తీసింది. పుత్తూరుకు చెందిన బాలసుబ్రమణ్యం అనే వ్యక్తి భార్య గౌరి.. మూడు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుని మరణించింది. గౌరీ కుటుంబ సభ్యులు దాడి చేస్తారమోనని భయంతో బాలసుబ్రమణ్యం గ్రామం విడిచి వెళ్లిపోయాడు. బుధవారం బాలసుబ్రమణ్యం చిన్నాన్న కృష్ణయ్య... పిల్లల పాఠశాల ధ్రువ పత్రాలు కోసం పుత్తూరుకు వచ్చాడు.

ఆ సమయంలో గౌరీ కుటుంబ సభ్యులు కృష్ణయ్యతో ఘర్షణ పడ్డారని... ఆ ఘర్షణలో కృష్ణయ్య మృతి చెందారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కృష్ణయ్య మృతదేహంతో కార్వేటినగరం కూడలిలో ధర్నా చేశారు. పోలీసులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్పీ సంఘటన స్థలానికి చేరుకొని ధర్నా చేస్తోన్న కృష్ణయ్య కుటుంబ సభ్యులను వారించారు. పోస్టుమార్టం నిమిత్తం దేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజు తెలిపారు.

ఇదీ చదవండి : 'రాజధాని రైతులను ఇబ్బంది పెట్టినవారిని వదలం'

Intro:AP_TPT_33_19_Endoment ministar_darsan_avb_c4 శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.

Body:చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇవాళ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆశీర్వచనాలను అందించి ఆలయం తరఫున తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్లలో ఆలయాలలో అవినీతి జరిగిందన్నారు. ఆలయ భూములను పరిరక్షించడంతో పాటు భక్తులకు అవసరమైన మెరుగైన వసతులు కల్పిస్తామని తెలిపారు. బృహత్తర ప్రణాళిక తో శ్రీకాళహస్తీశ్వరాలయం ని పూర్తిస్థాయిలో అభివృద్ధి పరుస్తామని హామీ ఇచ్చారు. ఆలయ అధికారుల తో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామన్నారు.

Conclusion:శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసుస్. ఈటివి భారత్ , శ్రీకాళహస్తి, సి.వెంకటరత్నం, 8008574559.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.