చిత్తూరు జిల్లాలోని శేషాచల అడవులలో ఎర్రచందనం స్మగ్లర్ల అలజడి పెరిగింది. తలకోన చామల రేంజ్ లో అటవీశాఖ అధికారులు కూంబింగ్ నిర్వహించగా.. ఎర్రచందనం అక్రమ రవాణాకు యత్నిస్తున్న సుమారు 20 మంది స్మగ్లర్లను గుర్తించారు. అధికారుల రాకను పసిగట్టిన స్మగ్లర్లు దుంగలను వదలి దట్టమైన అడవుల్లోకి పారిపోయారు.
వారిని వెంబడించిన పోలీసులు.. స్థానిక స్మగ్లరైన ధనంజేయులు, వీరభద్రయ్య, చిరంజీవి, వినోద్ కుమార్, నాగరాజును అరెస్ట్ చేశారు. పారిపోయిన వారికోసం గాలింపు చేపట్టినట్లు భాకరాపేట ఎఫ్ఆర్వో పట్టాభి తెలిపారు.
ఇదీ చదవండి: