ETV Bharat / state

బర్డ్​లో అరుదైన మోకీళ్ల శస్త్ర చికిత్స - బర్డ్ ఆస్పత్రి అరుదైన శస్త్ర చికిత్స

బర్డ్‌లో తొలిసారి అరుదైన మోకీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సను నొప్పి లేకుండా, ఫిజియోథెరపీ అవసరం లేకుండా చేసినట్లు డైరెక్టర్‌ డాక్టర్‌ మదన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. రెండు మోకీళ్లు వంకర పోయి నడవడమే కష్టంగా ఉన్న ఒక మహిళకు అత్యంత క్లిష్టమైన ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించామని తెలిపారు.

Rare knee surgery in Bird hospital tirupathi

author img

By

Published : Nov 21, 2020, 8:11 AM IST

తిరుపతిలో ఉన్న బాలాజీ వికలాంగుల శస్త్రచికిత్స పరిశోధన, పునరావాస కేంద్రంలో అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. రెండు మోకీళ్ళు వంకర పోయి నడవడమే కష్టంగా ఉన్న కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన సుజాతకు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు బర్డ్ డైరెక్టర్ మదన్ మోహన్ రెడ్డి తెలిపారు.

జూన్ 6న కుడి మోకీలు, అక్టోబర్ 30న ఎడమ మోకీలుకు శస్త్ర చికిత్స చేసినట్లు వెల్లడించారు. పసితనంలో కామెర్లు వ్యాధి నివారణ కోసం కాళ్లకు వాతలు వేయడంతో కాళ్ళు వంకర తిరిగినట్లు రోగి సుజాత తెలిపారు. నొప్పితో బాధపడుతున్న తనకు.. బర్డ్ ఆసుపత్రి వైద్యులు మళ్లీ ప్రాణం పోశారని ఆమె ధన్యవాదాలు తెలిపారు.

బర్డ్​లో అరుదైన మోకీళ్ల శస్త్ర చికిత్స

ఇదీ చదవండి: మాన్సాస్‌ ట్రస్ట్‌ వివాదం.. మరింత ముదిరింది..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.