చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో కరోనా వైరస్ ప్రభావంతో దేవాదాయశాఖ ఆర్జిత సేవలు రద్దు చేసింది. ప్రధానంగా రాహు, కేతు, సర్ప దోష నివారణ పూజలు, చండీహోమం, రుద్రహోమం, కల్యాణోత్సవం, శనేశ్వరస్వామి అభిషేకాలను మార్చి 31 వరకు నిలిపివేస్తూ దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. స్వామి, అమ్మవార్లకు జరిగే పూజలన్నీ యథావిధిగా జరపనున్నారు. ఈనెల 31 తర్వాత పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోనున్నారు. పూజల రద్దుతో మండపాలన్నీ మూతపడ్డాయి. భక్తుల రద్దీ తగ్గిపోయి క్యూలైన్లన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి.
ఇదీ చదవండి: కరోనా వైరస్ ప్రభావంతో వెలవెలబోతున్న తిరుమల