రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గాల కోసం.. వేర్వేరు కంపెనీల నుంచి సమీకరించిన రూ. 3 కోట్ల సీఎస్ఆర్ ఫండ్‌ను ఎంపీ మిథున్ రెడ్డి కలెక్టర్ హరినారాయణన్ అందజేశారు.
మదనపల్లెలో అధికారులు, వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన.. నిధులను వెంటిలేటర్లు ఆక్సిజన్ కొరత లేకుండా సౌకర్యాలు కల్పించాలని వినియోగించాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఉదయం పుంగనూరు నియోజకవర్గంలో కోవిడ్ వ్యాప్తి నివారణకు ఎంపీ మిథున్ రెడ్డి రూ. కోటి సొంత నిధులను విరాళంగా అందజేశారు.
ఇదీ చదవండి: