ETV Bharat / state

ఊరందూరులో తిరుపతి ఉప ఎన్నికల బహిష్కరణ! - uranduru elections bycott news

శ్రీకాళహస్తి మునిసిపాలిటీలో తమ ప్రాంతాన్ని కలపడాన్ని నిరసిస్తూ ఊరందూరు ప్రజలు.. తిరుపతి ఉపఎన్నికను బహిష్కరించారు. ఈ మేరకు ఆ గ్రామంలో దండోరా వేయించారు. ఊరందూరు మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్వగ్రామం.

elections bycott in uranduru
తిరుపతి ఉప ఎన్నికలను బహిష్కరించిన ఊరందూరు
author img

By

Published : Apr 15, 2021, 9:14 PM IST

చిత్తూరు జిల్లాలోని ఊరందూరు పంచాయతీని శ్రీకాళహస్తి పురపాలక సంఘంలో విలీనం చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ చర్యకు నిరసనగా తిరుపతి ఉపఎన్నికలను బహిష్కరించాలని అక్కడి స్థానికులు నిర్ణయించారు. ఈ మేరకు గ్రామంలో దండోరా వేయించారు.

గతంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు..

శ్రీకాళహస్తికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో సుమారు మూడు వేల మంది జనాభా ఉంది. రెండు వేల ఓటర్లు కలిగిన ఈ పంచాయతీని పురపాలక సంఘంలో విలీనం చేసేందుకు గతంలో అధికారులు చర్యలు చేపట్టారు. ఈ విషయమై స్థానికులంతా ఏకమై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కారణాల వల్ల ఆ గ్రామంలో పంచాయతీ ఎన్నికలు జరగలేదు. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్వగ్రామమైన ఊరందూరులో ఎన్నికలను బహిష్కరించడం చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చదవండి:

వైకాపా సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది: శైలజానాథ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.