చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద పూతలపట్టు- నాయుడు పేట జాతీయ రహదారిపై అదుపు తప్పిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా కొట్టింది. నెల్లూరు నుంచి తిరుపతికి వెళ్తున్న ఆ వాహనం ఏర్పేడు వద్ద ప్రమాదం జరిగింది. ఈ సమయంలో అందులో ప్రయాణికులు లేకపోవడం వల్ల పెనుప్రమాదం తప్పింది. ఈ క్రమంలో రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సాయంతో బస్సును పక్కకు తీసి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు.
ఇదీ చదవండి: