ETV Bharat / state

శివరాత్రి ఉత్సవాలకు కొనసాగుతున్న ఏర్పాట్లు - శివరాత్రి ఉత్సవాలు శ్రీకాళహస్తిలో

మహాశివరాత్రిని పురస్కరించుకొని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ నెల 16 నుంచి 28 వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు దేశ నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు.

Preparations for Shivaratri celebrations are in full swing
శివరాత్రి ఉత్సవాలకు జోరుగా కొనసాగుతున్న ఏర్పాట్లు
author img

By

Published : Feb 12, 2020, 6:26 PM IST

శివరాత్రి ఉత్సవాలకు కొనసాగుతున్న ఏర్పాట్లు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవ నిర్వహణకు ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ నెల 16 నుంచి 28 వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు దేశ నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరుకానున్న నేపథ్యంలో వసతులు కల్పించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ముక్కంటి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. విద్యుత్ దీపాలు, ఆకట్టుకునే రంగవల్లులతో ముస్తాబు చేస్తున్నారు. దాతల సహకారంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిపేందుకు చర్యలు చేపట్టినట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి:శ్రీవారి సేవలో శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.