చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం బుచ్చినాయుడుపల్లి పంచాయతీలోని ఎస్సీ కాలనీలో విద్యుత్‌శాఖ అధికారులు కరెంట్ కట్ చేశారు. విద్యుత్ బకాయిలు ఉన్నాయనే కారణంతో సుమారు15 ఇళ్లల్లో కరెంట్ కట్ చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా కరెంట్ కట్ చేయడం ఏంటని గ్రామస్థులు ప్రశ్నించారు. దళితులపై అధికారులు వివక్ష చూపుతున్నారని వారు ఆరోపించారు. కరోనా కారణంగా గత రెండు నెలల నుంచి కరెంట్ బిల్లులు చెల్లించలేదు ... అధికారులు అక్టోబర్ నెలలో వేసిన బిల్లులు చూసి అవాక్కయ్యారు. సాధారణంగా వచ్చే బిల్లుల కంటే పదింతలు ఎక్కువ రావడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. కోవిడ్ వల్ల ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధితులు వాపోయారు. మరోవైపు వర్షాలు పడుతున్న అధికారులు కరెంట్ సరఫరా నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పాత బకాయిలు కలిపి వేల రూపాయల బిల్లులు వచ్చాయని ...అధికారులు స్పందించి కరెంట్ బిల్లులను పరిశీలించి చెల్లింపులకు సమయం కేటాయించాలని వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి. సాగర్‌కు పోటెత్తిన వరద.. 20 గేట్లు ఎత్తివేత