చిత్తూరు జిల్లా రైల్వేకోడూరు మార్గంలోని ఆంజనేయపురం చెక్‌పోస్ట్ వద్ద ఎర్రచందనాన్ని పోలీసులు గుర్తించారు. తనిఖీలు నిర్వహిస్తుండగా రెండు ఎర్రచందనం దుంగలు గల రెండు కార్లను ప్రత్యేక కార్యదళం అధికారులు గమనించారు. ద్విచక్రవాహనంపై ఓ వ్యక్తి ఆ కార్లకు పైలట్‌గా వస్తుండగా.. కార్లు నడుపుతున్న మరో ఇద్దరిని సైతం అడ్డుకునేందుకు అధికారులు ప్రయత్నం చేశారు. ఆ ముగ్గురూ కొంతదూరం తర్వాత వాహనాలు ఆపేసి.. పారిపోయే ప్రయత్నం చేశారు.
వెంటాడి పట్టుకున్న పోలీసులు.. వారిని రేణిగుంట మండలం కుర్రకాలువకు చెందిన కేవీ. కార్తీక్ (30), ఏర్పేడు మండలం పాపానాయుడు పేటకు చెందిన ఎం. శశి కుమార్ (28), గుడిమల్లంకు చెందిన చల్లా బాలాజీ (22) గా గుర్తించారు. వీరిని విచారణ చేయగా చంద్రగిరి, వికృతమాలకు చెందిన ఇద్దరు వ్యక్తులతో కలిసి ఎర్రచందనాన్ని చెన్నైకి పంపుతున్నట్లు అంగీకరించారు. రెండు కార్లు, ద్విచక్రవాహనం, రెండు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: