దాదాపు 5 కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా పుత్తూరు సమీపంలోని సదాశివకోన అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్లు దాచిన డంప్‌ను పోలీసులు గుర్తించారు. అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తుండగా 348 ఎర్రచందనం దుంగలను గుర్తించినట్లు టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ మురళీధర్ తెలిపారు. ఎర్రచందనం దుంగలను దాచిన స్మగ్లర్ల కోసం సదాశివకోన అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టినట్లు డీఎస్పీ వెల్లడించారు.
ఇదీ చదవండి: తెలుగు రాష్టాల మధ్య జలవివాదం..ప్రాజెక్టుల వద్ద భద్రత పెంపు