పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా చిత్తూరులో నిర్వహించిన పోలీస్ బ్యాండ్ షో ఆకట్టుకుంది. నగరంలోని గాంధీ విగ్రహ కూడలిలో పోలీస్ బ్యాండ్ బృందం సభ్యులు ప్రదర్శన నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు.
పోలీసు అమరులను గుర్తుచేసుకునేలా చిన్నారులు నృత్య ప్రదర్శన చేశారు. విధుల్లో ప్రాణాలు విడిచిన పోలీసులను సర్మించుకున్నారు. అడిషనల్ ఎస్పీ మహేష్, ఏఆర్ డీఎస్పీ లక్ష్మి నారాయణ రెడ్డి, ఆర్ఐలు జావిద్, వీరేశ్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి:
రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్... వెట్టి నుంచి బాలలకు విముక్తి