ETV Bharat / state

ఘరానా మోసగాడిని అరెస్ట్ చేసిన పోలీసులు - చిత్తూరు జిల్లా నేర వార్తలు

నెలనెల పింఛన్ ఇప్పిస్తానంటూ పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించి... పరారైన ఘరానా మోసగాడిని పెద్ద మండ్యం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు వివరాలను మదనపల్లె డీఎస్పీ రవి మనోహరాచారి వెల్లడించారు.

ఘరానా మోసగాడిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఘరానా మోసగాడిని అరెస్ట్ చేసిన పోలీసులు
author img

By

Published : Apr 26, 2021, 8:51 PM IST

'సేఫ్ అండ్ సెక్యూర్' ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక్కొక్కరి నుంచి 12 వేలు డిపాజిట్లు సేకరించిన మోసగాడు రూపేశ్​ను చిత్తూరు జిల్లా పెద్ద మండ్యంలో పోలీసులు అరెస్ట్ చేశారు. నెలనెలా 2,900 పింఛన్ ఇస్తానంటూ ప్రజలను నమ్మబలికి పెద్ద మెుత్తంలో డిపాజిట్లు సేకరించిన రూపేశ్.. గతేడాది అగస్టులో తన తండ్రి చంద్రప్పతో కలిసి డబ్బుతో పారిపోయాడు. బాధితుల ఫిర్యాదుతో గతేడాది నవంబర్​లో రూపేశ్ తండ్రి చంద్రప్పను పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్ద మండ్యం మండలం చెరువు కిందపల్లి వద్ద రూపేశ్​ను గమనించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. తండ్రి చంద్రప్ప నుంచి 6 లక్షలు, రూపేశ్ నుంచి 15 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు వివరాలను మదనపల్లె డీఎస్పీ రవి మనోహరాచారి వెల్లడించారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 9,881 కరోనా కేసులు, 51 మరణాలు

నక్సలైట్ల దుశ్చర్య- ట్రాక్టర్లు, ట్యాంకర్లు దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.