ETV Bharat / state

గడప గడపలో ఉప ముఖ్యమంత్రికి నిరసన సెగ.. ప్రశ్నించిన టీడీపీ, జనసేన నేతలు - చిత్తూరులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం

GADAPA GADAPA PROGRAM : గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు, నాయకులకు ప్రజల నుంచి నిరసన సెగలు, అడ్డగింతలు సాధారణమైపోయాయి. ఎన్నికల వేళ హామీలు ఇచ్చి గెలిచి.. మాట తప్పిన నాయకులను ప్రజలు నిలదీస్తున్నారు. తాజాగా చిత్తూరులో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికి నిరసన సెగ ఎదురైంది.

GADAPA GADAPA PROGRAM
GADAPA GADAPA PROGRAM
author img

By

Published : Feb 2, 2023, 12:11 PM IST

GADAPA GADAPA PROGRAM : వైఎస్సార్​సీపీ పాలన వచ్చాక.. ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేలా ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు నిరసనలు తప్పడం లేదు. తమ గ్రామాలకు వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు అడ్డగిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచాక గ్రామానికి ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని నిలదీస్తున్నారు. తమ సమస్యల పరిష్కరించేవరకూ గ్రామంలోకి రావొద్దని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. తాజాగా ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామికి ప్రజల నుంచి నిరసనలు తప్పలేదు.

DEPUTY CM NARAYANA SWAMY : చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం మారేపల్లె పంచాయతీలో గడప గడపకు మన ప్రభుత్వం పేరిట ఇంటింటి పర్యటన చేపడుతున్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామికి నిరసన సెగ తగిలింది. కాలనీలో దారి ఏర్పాటు విషయమై పరిష్కారం చూపిన తర్వాతే పర్యటించాలంటూ టీడీపీ, జనసేన కార్యకర్తలు స్పష్టం చేశారు. గతంలో పర్యటించిన ఏ గ్రామంలోనూ ఇటువంటి పరిస్థితి ఎదురు కాలేదంటూ మంత్రి అసహనం వ్యక్తం చేశారు. గతేడాది ఉపాధి హామీ పథకంలో నిధుల స్వాహాకు పాల్పడిన ఆరోపణలతో విధుల బహిష్కరణకు గురైన క్షేత్ర సహాయకురాలు.. తనకు న్యాయం చేయాలంటూ ప్రాధేయపడింది. రికవరీ మొత్తాన్ని చెల్లించాలని మంత్రి తెగేసి చెప్పడంతో..తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యం అంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.