ETV Bharat / state

హోమ్‌ ఐసోలేషన్‌కే కరోనా బాధితుల మొగ్గు - హోమ్‌ ఐసోలేషన్‌కే కరోనా బాధితుల మొగ్గు

కరోనా బాధితులు హోం ఐసోలేషన్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. చిత్తూరు జిల్లాలో నాలుగు నెలల కాలం నుంచి మంగళవారం రాత్రి వరకు 9,273 మందికి వైరస్‌ సోకగా 3,700 వరకు యాక్టివ్‌ కేసులున్నాయి. వీరిలో 1,125 మంది హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నట్లు చిత్తూరు జిల్లా జేసీ(అభివృద్ధి) వీరబ్రహ్మం తెలిపారు.

people are showing interest to stay at homes in chittor
హోమ్‌ ఐసోలేషన్‌కే కరోనా బాధితుల మొగ్గు
author img

By

Published : Jul 29, 2020, 11:50 AM IST

పెరుగుతున్న కరోనా కేసులకు తగ్గట్టుగా పడకలు పెంచలేని పరిస్థితి చిత్తూరు జిల్లాలో నెలకొంది. జిల్లాలో ఏడు వేల పడకలు సిద్ధం చేసినా.. రాబోవు రోజుల్లో మరింత అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. పడకల మాట అలా ఉంచితే.. ఇప్పటికే పడకల్లో ఉన్న కొవిడ్‌ బాధితులకు వైద్య సేవలందించే వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో హోం ఐసోలేషన్‌ ప్రత్యామ్నాయం అని ప్రభుత్వం భావించింది.

కరోనా బాధితులు హోం ఐసోలేషన్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. జిల్లాలో నాలుగు నెలల కాలం నుంచి మంగళవారం రాత్రి వరకు 9,273 మందికి వైరస్‌ సోకగా 3,700 వరకు యాక్టివ్‌ కేసులున్నాయి. వీరిలో 1,125 మంది హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నట్లు చిత్తూరు జిల్లా జేసీ(అభివృద్ధి) వీరబ్రహ్మం తెలిపారు. కరోనా సోకిన వ్యక్తికి రక్త పరీక్షలు, ఎక్స్‌రే, శ్వాస పరీక్షలు చేసి వ్యాధి తీవ్రతను నిర్ణయిస్తారు. వైరస్‌ సోకిన ప్రతి 100 మందిలో 75 మందికి ఎటువంటి లక్షణాలు ఉండవు. అలాంటి బాధితులు ఇంటి వద్దనే ఉంటూ పది రోజులు ఆరోగ్య కార్యకర్తల సలహాలు పాటించాలి. ఇంటిలో వేరే గది, మరుగుదొడ్డి ప్రత్యేకంగా ఉన్నప్పుడే హోమ్‌ ఐసోలేషన్‌ ఎంచుకోవాలి. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులకు దూరంగా ఉండాలి. ఇంటిలోని ఇతరులు ఎల్లప్పుడు మాస్కు ధరించాలి. వైరస్‌ సోకిన వ్యక్తి వస్తువులు, దుస్తులు తాకరాదని వైద్యులు సూచిస్తున్నారు.

  • ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

ఎప్పుడూ మొబైల్‌ ఫోన్‌ ఆన్‌లో ఉంచుకోవాలి. ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్లోడ్‌ చేసుకోవాలి. కార్యకర్తలు అందజేసిన మందులు వాడాలి. జ్వరంగానీ ఇతరత్రా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే 104 ఫోన్‌ చేయాలి. వెంటనే జిల్లా కేంద్రంలోని కాల్‌ సెంటరు ద్వారా పర్యవేక్షణ చేస్తారు. స్మార్ట్‌ఫోన్‌ ఉన్న పక్షంలో వీడియోకాల్‌ సైతం చేస్తారు. అత్యసరమైన పక్షంలో మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలిస్తారు. ఇందుకోసం చిత్తూరులోని కాల్‌ సెంటర్‌ను మరింత సమర్థంగా పని చేసేలా ఏర్పాట్లు చేశారు.

  • త్వరలో టెలీ మెడిసిన్‌ సేవలు

హోం ఐసోలేషన్‌ తీసుకున్నవారు ఎప్పటికప్పుడు వైద్యుల సూచనలు నిమిత్తం టెలీ మెడిసిన్‌.. వీడియో ద్వారా బాధితుల యోగక్షేమాలు తెలుసుకుని వైద్యం అందించేందుకు జిల్లా సమన్వయ కమిటీ చర్యలు చేపడుతోంది. హోం ఐసోలేషన్‌లో ఉన్న బాధితులు రోజూ ఉదయం 6, 10 మధ్యాహ్నం 2, సాయంత్రం 6, రాత్రి పది గంటలకు శరీరంలోని ఉష్ణోగ్రతల స్థాయిని సరిచూసుకోవాలి. రోజులో మూడుసార్లు ఆక్సోమీటర్‌తో పల్స్‌స్థాయిని పరిశీలించి.. 94కు తగ్గితే వైద్యులను చరవాణిలో సంప్రదించాలి. మంచి పౌష్టికాహారం సమయానికి తీసుకోవాలి. భయాందోళన.. కలత చెందకుండా మానసిక ప్రశాంతతకు ప్రయత్నించాలి. వీలైనంతగా వ్యాయామాలు, ఇది వరకటి అనుభవం మేరకు ప్రాణాయామం, యోగా చేసుకోవాలి.

  • కిట్టులో కనికట్టు

బాధితుల ఇష్టం మేరకు హోమ్‌ ఐసోలేషన్‌కు వెళతామనే వారి నుంచి అంగీకార పత్రం రాయించుకుని ఇంటికి వెళ్లే సమయంలో కిట్టు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. కొన్ని జిల్లాల్లో మాత్రలతో పాటు 2 గార్బేజీ కవర్ల ప్యాకెట్లు, రెండు శానిటైజర్లు(100 మి.లీ), 30 మూడు పొరల మాస్కులు అందిస్తున్నారు. జిల్లాలో మాత్రం 5 రోజులకు సరిపడా పారాసిటమాల్‌, సిట్రజన్‌, సి-విటమిన్‌ అందిస్తున్నారు. ఇతరత్రా ఏమీ అందించడంలేదని బాధితులు వాపోతున్నారు. కిట్టు ఇవ్వడంలో భాగంగా పల్స్‌ ఆక్సీమీటరు ఇవ్వడం ద్వారా పరీక్షలకు సౌలభ్యంగా ఉంటుందని కోరుతున్నారు.

ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..

బలవర్థకమైన ఆహారాన్ని తీసుకోవాలి. శాఖాహారులు పప్పు ధాన్యాలకు, పాలు, పండ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. మాంసాహారులు పాలు, పండ్లు, గుడ్డు, చికెన్‌, చేపలు ఆహారంగా తీసుకోవచ్ఛు.

- డాక్టర్‌ శ్రీనివాసరావు, బాధ్యులు, శ్రీనివాసం కొవిడ్‌ ఆస్పత్రి

ఇదీ చదవండి:

కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలం: చంద్రబాబు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.