రాహుల్ గాంధీ ప్రధానిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే...రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తీసుకువస్తామని పీసీసీ చీఫ్ శైలజానాథ్ అన్నారు. తిరుపతిలో నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఆయన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతామోహన్ తరఫున ఉపఎన్నిక ప్రచారాన్ని నిర్వహించారు.
భాజపా, వైకాపాలకు తిరుపతి ఉపఎన్నికల్లో ఓటు అడిగే హక్కే లేదని ఆయన అన్నారు. విభజన హామీలను నెరవేర్చటం తమ బాధ్యతగా తీసుకుంటామని శైలజానాథ్ స్పష్టం చేశారు. మన్నవరంలో మూత పడిన బీహెచ్ఈఎల్ ఫ్యాక్టరీ సహా మూతపడిపోయిన పరిశ్రమలన్నింటినీ తిరిగి తెరిపిస్తామన్నారు.
ఇదీ చదవండి: అణు కర్మాగారంపై దాడి ఇజ్రాయెల్ పనే: ఇరాన్