తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 30వ తేదీ నుంచి మూడురోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహించనున్నారు. ఉత్సవాలకు బుధవారం అంకురార్పణ కార్యక్రమం జరగనుంది. ఏడాది పొడవునా శ్రీవారి ఆలయంలో జరిగే పూజలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలిసీ, తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. మొదటి రోజున పవిత్రాల ప్రతిష్ట, రెండవరోజు పవిత్ర సమర్పణ, ఆఖరి రోజున పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఉత్సవాలు జరిగే ఈ మూడురోజుల పాటు ఆర్జిత సేవలను రద్దు చేశారు.
ఇదీ చదవండి: స్వదేశీ 'ఫార్మా'కు జై.. కేంద్రం మార్గదర్శకాలు!