ETV Bharat / state

పాకాల: పోలీసులకు చిక్కిన ఘరానా మోసగాడు - Chittoor district Latest News

చిత్తూరు, నెల్లూరు జిల్లాలో నిరుద్యోగులకు ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్స్ కల్పిస్తానని కోటి రూపాయలకు పైగా కాజేసిన ఘరానా మోసగాడు పోలీసులకు చిక్కాడు. ఎస్​ఐ, ఆర్ఎస్ఐ, విజిలెన్స్ ఎస్ఐ, ట్రైనీ ఎస్ఐ, మంత్రుల సలహాదారుడి అని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్న పుంగనూరు మండలం నెక్కుండి పంచాయతీ బత్తలాపురానికి చెందిన రాజశేఖర్​ను పాకాల పోలీసులు అరెస్టు చేశారు.

ఎస్సై రాజశేఖర్
ఎస్సై రాజశేఖర్
author img

By

Published : Apr 11, 2021, 2:12 PM IST

ఎస్సై రాజశేఖర్

ప్రభుత్వ అధికారినని, ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి కోటి రూపాయలకు పైగా కాజేసిన ఘరానా మోసగాడు పీతాంబరం రాజశేఖర్​ను పాకాల పోలీసులు అరెస్టు చేశారు. పుంగనూరు మండలం నెక్కుండి పంచాయతీ బత్తలాపురానికి చెందిన రాజశేఖర్.. ఏ ఉద్యోగం లేకపోయినా టాస్క్​ఫోర్స్​లో ఆర్ఎస్ఐని అంటూ ఒకచోట, పుత్తూరు ఎస్సైనంటూ మరోచోట చెప్పుకొనేవాడు. తిరుమలలో విజిలెన్స్ ఎస్సైనని, ప్రొటోకాల్ అధికారినని నమ్మబలికేవాడు. పలమనేరు, పెద్దపంజాణిలో ట్రైనీ ఎస్పైగా చెప్పుకొన్నాడు. కేంద్రమంత్రి కిషన్​రెడ్డికి ప్రత్యేక సహాయకుడినని, మాజీ ఉపముఖ్యమంత్రి చినరాజప్పకు సహాయకుడినంటూ గొప్పలు చెప్పాడు. తన భార్య ఐఏఎస్ అధికారిణి అని ప్రచారం చేసుకున్నాడు.

తిరుపతి, తిరుమల, పలమనేరు, నెల్లూరు తదితర ప్రాంతాల్లో పదోన్నతులు, బదిలీలు చేయిస్తానని ఉపాధ్యాయులు, డాక్టర్లు, పోలీసులు, ఏఎన్ఎంలతో పాటు పలువురిని రాజశేఖర్ మోసం చేశాడు. ఎర్రచందనం అక్రమ రవాణాలో సీజ్ చేసిన వాహనాలను తక్కువ ధరకు ఇప్పిస్తానని పలువురిని బురిడీ కొట్టించాడు. దీనిపై ఓ బాధితుడు పాకాల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణకు హాజరుకావాలని నిందితుడికి పోలీసులు సూచించారు. రాకుండా... చెన్నైకి పారిపోయేందుకు యత్నిస్తుండగా నేండ్రగుంట వద్ద నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఇదీ చదవండీ... కడపలో దారుణం.. భార్యను కత్తితో నరికిన భర్త

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.