ETV Bharat / state

'ఆపరేషన్ కొంకీ' రేపటికి వాయిదా

చిత్తూరు జిల్లా పుత్తూరు సమీపంలో రెండు నెలలుగా ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న.. ఒంటరి ఏనుగును పట్టుకునేందుకు జిల్లా అటవీశాఖ అధికారులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. 'ఆపరేషన్ కొంకీ' పేరుతో ఈ బృందం రంగంలో దిగింది.

'Operation Konki'
'ఆపరేషన్ కొంకీ' రేపటికి వాయిదా
author img

By

Published : Mar 13, 2021, 12:45 PM IST

పుత్తూరు పరిసర ప్రాంతాల్లో రైతులు, గ్రామస్థులను ఇబ్బంది పెడుతున్న ఒంటరి ఏనుగును పట్టుకునేందుకు ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. జిల్లా తూర్పు విభాగం అటవీశాఖ అధికారి నరేష్థరన్ నేతృత్వంలో 'ఆపరేషన్ కొంకీ' పేరుతో​ కొనసాగింది. ఈ కార్యక్రమం కోసం కుప్పం ప్రాంతంలోని ననియాల వద్ద శిక్షణ పొంది సంరక్షణలో ఉన్న జయంత్, వినాయక్ అనే ఏనుగులను లారీల్లో పుత్తూరు పరిధిలోని అమరం, కండిగ, నందిమంగళం గ్రామాల వద్దకు తీసుకొచ్చారు. ఈ ఆపరేషన్​లో భాగంగా.. ఒంటరి ఏనుగును దారి మళ్లించేందుకు బాణాసంచా పేల్చారు.

తిరుపతి జూపార్కు వైద్యులు అరుణ్, రోహిబ్ సింగ్, పర్యవేక్షణలో ఒంటరి ఏనుగును లొంగ తీసుకొవటానికి సుమారు మూడున్నర గంటల సేపు ఆపరేషన్ కొనసాగించారు. అయితే.. ఒంటరి ఏనుగు.. కుప్పం ఏనుగులకు లొంగినట్టే.. లొంగి తప్పించుకుంది. చీకటి పడటంతో ఆపరేషన్​ను రేపటికి వాయిదా వేసుకున్నారు. ప్రజలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్ల నుంచి బయటికి రావద్దని ఆంక్షలు జారీ చేశారు. ఈ ఆపరేషన్​లో చిత్తూరు, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, పుత్తూరు, కార్వేటినగరం డివిజన్​ పరిధిలోని.. అటవీశాఖ అధికారులు, స్థానిక పోలీస్​ అధికారులు, సిబ్బంది 100 మందికిపైగా పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

ఆలనాపాలనకు నోచుకోని స్వర్ణాల చెరువు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.