ETV Bharat / state

ఎదురెదురుగా ఢీకొన్న కార్లు... ఒకరు మృతి - chithore district crime

రెండు కార్లు ఎదురెదురుగా వేగంగా వచ్చి ఢీ కొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదం చిత్తూరు జిల్లాలోని ముంగిలిపట్టు వద్ద పూతలపట్టు - నాయుడుపేట జాతీయ రహదారిపై జరిగింది.

one-man-died-in-a-road-accident-at-mungilipattu-chithore-district
ఎదురెదురుగా ఢీకొన్న కార్లు... ఒకరు మృతి
author img

By

Published : Jun 17, 2021, 9:58 AM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ముంగిలిపట్టు వద్ద పూతలపట్టు - నాయుడుపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి చెన్నై వెళ్తున్న కారు, చెన్నై నుంచి తిరుపతికి వస్తున్న కారు ఎదురెదురుగా ఢీ కొన్నాయి.

ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా... మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

Ragurama letter to CM Jagan: 'పేదలందరికీ త్వరితగతిన ఇళ్ల నిర్మాణం చేపట్టాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.