టోక్యో ఒలింపిక్స్ విశ్వ క్రీడల్లో హాకీ పురుషుల జట్టు కాంస్య పతకం సాధించడం, మహిళా జట్టు నాలుగో స్థానానికి చేరుకోవడం ఎంతో స్ఫూర్తిదాయకమని ఒలింపిక్స్ హాకీ క్రీడాకారిణి రజనీ అన్నారు. మున్ముందు జరిగే పోటీలకు ఇది ఒక స్ఫూర్తి మంత్రంగా నిలుస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. టోక్యో ఒలింపిక్స్ ముగించుకొని మొట్టమొదటిసారిగా చిత్తూరు జిల్లాలోని స్వగ్రామానికి ఆమె చేరుకున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం తిరుపతిలో ఎంపీ గురుమూర్తి ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. జిల్లాలో హాకీ అకాడమీకి అవసరమైన మౌలిక సదుపాయాలపై ముఖ్యమంత్రి జగన్, ఇతర ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు వివరించారు. చిత్తూరు జిల్లా నుంచి మరింత మంది రజనీలు తయారు కావడమే తన లక్ష్యమని చెప్పారు.
ఇదీ చదవండి: