తిరుపతి ప్రభుత్వ ఆస్పత్రిలో నర్సింగ్ మహిళా అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. ఇంటర్వ్యూలకు హాజరైన నర్సింగ్ మహిళా అభ్యర్థుల ఫైనల్ లిస్టులో అవకతవకలు జరిగాయంటూ సోమవారం ఆస్పత్రి ఆవరణలో నిరసనకు దిగారు. తమకు అన్యాయం జరిగిందంటూ వైద్యాధికారులను చుట్టు ముట్టారు. ఒక లిస్ట్‌లో వున్న పేర్లు.. మరొక లిస్ట్ లో లేకపోవడంలో ఆంతర్యం ఏంటని నిలదీశారు. ప్రభుత్వ వెబ్సైట్లో ఇప్పటికే మూడు మెరిట్ లిస్ట్ మార్చడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: సోమవారం నుంచి మళ్లీ భారీ వర్షాలు: ఐఎండీ