ETV Bharat / state

తిరుగిరుల్లో హారన్​ శబ్ధాలు మానండి... గోవింద శ్లోకాలు వినండి...

author img

By

Published : Jun 20, 2020, 12:55 PM IST

ఏడుకొండలలో గోవింద నామస్మరణలను వింటూ..శ్రీవారిని స్మరించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. తిరుమల కొండపై శబ్ద కాలుష్య నియంత్రించేందుకు పోలీసు శాఖ చర్యలు ప్రారభించింది. నో హారన్ జోన్​గా తిరుమలను మలిచేందుకు పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు.

No Horn Zone  in tirumala
తిరుమలలో నో హార్న్ జోన్

పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల క్షేత్రంలో నిత్యం వేదమంత్రోచ్చరణలు, గోవిందనామ స్మరణలతో మధ్య ఆధ్యాత్మిక వాతావరణం భక్తులు గడుపుతుంటారు. ప్రశాంత వాతావరణంలో వేలాది వాహనాలతో శబ్ధ, వాయు కాలుష్యం అధికంగా ఉంటోంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు తిరుపతి అర్బన్‌ ఎస్పీ రమేష్‌ రెడ్డి తిరుమల కొండను నో హారన్‌ జోన్​గా తీర్చిదిద్దేందుకు చర్యలు ప్రారంభించారు. తిరుమలకు వచ్చే భక్తులకు అవగాహన కల్పించడంతో పాటు... తిరుమల, తిరుపతి అద్దె వాహనదారులకు సూచనలు చేశారు. ఎస్పీ వాహన డైవర్‌తో పాటు... పలువురి అద్దె వాహనదారులచే హారన్‌ మోగించనని ప్రమాణం చేయించారు.

కొండలలో మారుమోగే వెంకటనాథుని గంటలను, గోవింద శ్లోకాలను వినాలని..ఆయన కోరారు. ఆధ్యాత్మకం అణువణువునా ఉండే కొండలలో శబ్ధ కాలుష్యం చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి.

ఆదివారం సూర్యగ్రహణం.. ప్రత్యేకత ఏంటో తెలుసా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.