చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో ఏటీఎం కేంద్రాలు నగదు లేక వెలవెలబోతున్నాయి. వారం రోజులుగా ఏటీఎం కేంద్రాల్లో నగదు లేకపోవడంతో మూసివేశారు. తిరుపతి నుంచి రావలసిన నగదు గూడ్స్ వాహనాలను పోలీసులు అనుమతించకపోవడంతో సమస్య ఉత్పన్నమవుతుందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.
మార్గమధ్యలోని రంగంపేట, చిన్నగొట్టిగల్లు గ్రామాలు కోవిడ్-19 రెడ్ జోన్ పరిధిలో ఉండటం కారణంగా ప్రధాన రహదారులపై వాహనాలను పోలీసులు అనుమతించలేదు. సంబంధిత అధికారులు స్పందించి ఏటీఎంలలో నగదు సౌకర్యం కల్పించాలని ఖాతాదారులు కోరుతున్నారు.
ఇది చదవండి 'అధైర్యం వద్దు.. అండగా ఉంటాం'