ETV Bharat / state

నమస్కారం పెడితే అంతే సంగతులు!! - bhumana karunakar reddy

ఎన్నికల ప్రచారంలో ఎన్నో సిత్రాలు చూస్తాం.. ఆయన మాత్రం నమస్కారం పెట్టి మరీ చిత్రం చూపిస్తారు. ప్రచారమంటూ మీ ఇంటికొచ్చి దండం పెడతాడు. మీరు నవ్వుతూ ప్రతి నమస్కారం చెప్పగానే దగ్గరికి తీసుకుని ఫోటో దిగుతారు. తెల్లారేసరికి మీకు బొమ్మ చూపిస్తారు.

భూమన కరుణాకర్ రెడ్డి
author img

By

Published : Apr 2, 2019, 6:07 PM IST

Updated : Apr 2, 2019, 6:24 PM IST

భూమన కరుణాకర్ రెడ్డి

భూమన కరుణాకర్ రెడ్డి.. వైకాపాకు చిత్తూరు జిల్లాలో సీనియర్ నేత. 2004లో తిరుపతి ఎమ్మెల్యేగా, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఛైర్మన్​గా పనిచేశారు. అధికారానికి దూరమై దశాబ్దం గడుస్తున్నా.. ఎన్నికలు వచ్చాయంటే ఎగిరి గంతేస్తారు. ఎవరైనా ఆయన దగ్గరకు వెళ్లి కరచాలనం చేసిందే పాపం. ఇష్టం ఉన్నా లేకున్నా మెడలో కండువా వేయటం.. వారితో కలిసి ఫోటోలు దిగటం క్షణాల్లో జరిగిపోతాయి. ఇక్కడితో భూమన స్క్రీన్​ప్లే అయిపోదు. వైకాపాలో భారీగా చేరికలు అంటూ మరుసటి రోజు పత్రికలోకలర్ ఫొటోలు దర్శనమిస్తాయి. అంతే.. ఇక అవాక్కవటం ఆ ఫొటోల్లో ఇరుక్కుపోయినప్రజల వంతవుతుంది.

ఫోటో దిగితే.. జెండా మారింది

తెదేపా తరపున ఎమ్మెల్యే టికెట్ ఆశించిన వారిలో తుడా ఛైర్మన్ నరసింహయాదవ్ ఒకరు. టికెట్ దక్కకపోవటంతో ఓ సమయంలో ఆయన పూర్తి నిరాశకు లోనయ్యారు. స్వయంగా చంద్రబాబు నచ్చజెప్పటంతో తెదేపా అభ్యర్థి సుగుణమ్మకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రచారంలో భాగంగా నరసింహయాదవ్ మేనల్లుడు రాజా యాదవ్​ను కలిశారు. నమస్కారం చేసిన కరుణాకర్రెడ్డికి తిరిగి ప్రతినమస్కారం చేయగా... దగ్గరకు తీసుకుని ఫోటో దిగారు. ఒక్కసారిగా పార్టీ కండువా సైతం కప్పారు. తర్వాతి రోజు ఉదయాన్నే ఓ పత్రికలో భూమన ఆధ్వర్వంలో పార్టీలో చేరిన తుడా ఛైర్మన్ మేనల్లుడు అని ప్రచురించారు. పేపర్​లో వచ్చిన ఫోటోలు చూసి బాధితులు అయోమయానికి గురయ్యారు.

ఎన్నికల స్టంట్​తో అభాసుపాలు

కరుణాకరరెడ్డికి ఈ తరహా ప్రచారాలు కొత్తనుకుంటే పొరబాటే. 2014 ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి వెళ్లి ఓటెయ్యాలని ఓటర్లతో ప్రమాణాలు చేయించుకొని ఎన్నికల సంఘం ఆగ్రహానికి గురయ్యారు. ఇలాంటి ఎన్నికల స్టంట్​తో భూమన అభాసుపాలయ్యారు. ఈసారి మరోకొత్త ఎత్తుగడతో ఇలా సాధారణ ప్రజలను సైతం పార్టీలో చేరినట్లు... తెదేపా కార్యకర్తలు పార్టీ మారినట్లు చూపిస్తూ తిరుపతి వాసుల ఆగ్రహానికి గురవుతున్నారు. ఎన్నికల్లో నిల్చున్న అభ్యర్థిపై విశ్వాసం ఉంటే ప్రజలు ఓట్లేసి పట్టం కడతారు. ఈ తరహా దిగజారుడు రాజకీయాలు చేస్తే మరోసారి తగిన బుద్ధి చెబుతామని ప్రజలు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండి

'తెదేపా గెలుపు ఖాయం.. బాబు మళ్లీ సీఎం అవుతారు'

Intro:Body:Conclusion:
Last Updated : Apr 2, 2019, 6:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.