గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు వివిధ రకాలు సేవలు అందుతాయని.. చిత్తూరు జేసీ వీరబ్రహ్మం అన్నారు. తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డితో కలిసి గోపిదిన్నెలో గ్రామ సచివాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. భవన నిర్మాణంలో స్థానిక వైకాపా నాయకుల సహకారం ఎంతో ఉందన్నారు.
ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ఇక ఇక్కడ ఫ్యాక్షనిజానికి తావు లేదని..., ఆదర్శవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. హంద్రీనీవా నీటితో నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి...