‘సమ్త్ ఓ రఫ్తార్’ ఉర్దూ పుస్తకాన్ని కేంద్ర ప్రభుత్వం 2020వ సంవత్సరానికి గాను ఉత్తమ రచనగా ఎంపిక చేయడం అభినందనీయమని చిత్తూరు జిల్లా తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య రాజారెడ్డి పేర్కొన్నారు. ఉర్దూ విభాగాచార్యులు ఎండీ నిస్సార్ అహ్మద్, అమీనుల్లా సంయుక్తంగా రచించిన మంగళవారం వర్సిటీలోని ఉపకులపతి కార్యాలయంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఎస్వీయూలో ఉర్దూ విభాగాన్ని స్థాపించి అరవై ఏళ్లు పూర్తైందని, జాతీయస్థాయి గుర్తింపు పొందిన పుస్తకాలు ఈ విభాగం నుంచి వెలువడటం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. రచయితలు నిసార్ అహ్మద్, అమీనుల్లాను ఆయన అభినందించారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య సుందరవల్లి, రిజిస్ట్రార్ ఆచార్య శ్రీధర్‌రెడ్డి, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ డీన్ ఆచార్య విజయభాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి.