తెదేపా హయాాంలో జరిగిన అభివృద్ధి మాత్రమే ఇప్పటికీ కనిపిస్తోందని నగరి తెదేపా ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాశ్ అన్నారు. పుత్తూరు పట్టణాభివృద్ధి తెదేపా గెలుపుతోనే సాధ్యమన్నారు. పుత్తూరు మున్సిపాలిటీలోని 22వ వార్డులో తెదేపా కౌన్సిలర్ అభ్యర్థి జీవరత్నం నాయుడుతో కలిసి ప్రచారం నిర్వహించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు పూర్తయినా... అభివృద్ధి మాత్రం శూన్యమని భానుప్రకాశ్ విమర్శించారు. పురపాలక ఎన్నికల్లో తెదేపా గెలిస్తే అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయడంతోపాటు నిరుద్యోగ యువత కోసం ఆర్నెళ్లకోసారి ఉద్యోగ మేళా ఏర్పాటు చేస్తామన్నారు.
ఇదీ చదవండి: 'నామినేషన్ల సమయంలో దౌర్జన్యాలపై ఎస్ఈసీ స్పందన అనుమానాస్పదం'