చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం శ్రీరంగరాజపురం మండలం వడ్డేపల్లిలో ఓ కుటుంబం తన వ్యవసాయ పొలంలో లంకె బిందెలు ఉన్నాయంటూ ఎవరో భూతవైద్యుడు ఇచ్చిన సలహాతో గుట్టుచప్పుడు కాకుండా ఆ నిధిని కాజేయాలని పథకం రచించారు. నరబలి ఇస్తే నిధి సొంతం అవుతుందని భావించిన ఆ కుటుంబం… తమ సమీప బంధువైన ఓ మూగ మహిళను బలివ్వడానికి ఎంచుకొన్నారు. ఆమెకు మాయమాటలు చెప్పి వారంరోజుల కిందట పొలం వద్దకు తీసుకెళ్లి, వివస్త్రను చేసి క్షుద్రపూజలు చేయించినట్లు తెలుస్తోంది.
పూజలు చేసే సమయంలో తనను వెంటబెట్టుకుని వచ్చిన బంధువు శ్రీధర్ వద్ద వేట కత్తిని గమనించిన ఆ మహిళ… భయాందోళనతో తన సమీప బంధువుల ఇంటికి చేరుకుని సైగలతో తాను పడ్డ ఇబ్బందులు వివరించింది. బంధువుల ద్వారా సమాచారం అందుకున్న బాధితురాలి కుమారుడు కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నుంచి కాలినడకన గ్రామానికి చేరుకొని తల్లి నుంచి విషయాలు తెలుసుకొని శ్రీరంగరాజపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండీ... ఏ ఘనకార్యాలు సాధించారని సంబరాలు?: యనమల