ETV Bharat / state

ఆర్టీసీకి రూ. 10వేల జరిమానా వేసిన తిరుపతి మున్సిపల్‌ కమిషనర్‌ - తిరుపతి బస్టాండ్ లో మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీల వార్తలు

తిరుపతి బస్టాండ్ పరిసరాల్లో మున్సిపల్ కమిషనర్ గిరీషా ఆకస్మిక తనిఖీ చేశారు. పరిశుభ్రత పాటించని పలుదుకాణాలకు జరిమానా విధించారు.

Municipal Commissioner Sudden Inspections In Tirupati Bastand
అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మునిసిపల్ కమిషనర్
author img

By

Published : Dec 27, 2019, 9:55 AM IST

తిరుపతి టెంపుల్ సిటీగా ప్రపంచ ప్రసిద్ధి చెందినందున.. నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దాలని మునిసిపల్ కమిషనర్ గిరీషా అన్నారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ లో తనిఖీ చేసిన ఆయన..పారిశుద్ధ్యాన్ని నిర్లక్ష్యం చేసిన అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బస్టాండ్‌లో చెత్తబుట్టలు ఏర్పాటు చేయని దుకాణాదారులకు జరిమానా విధించారు. మూత్రశాలలు, మరుగుదొడ్లపై పర్యవేక్షణ లోపించి దుర్వాసన వస్తుండటాన్ని తీవ్రంగా పరిగణించిన ఆయన... ఆర్టీసీకి పదివేల రూపాయల జరిమానా విధించారు. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తిరుపతి రైల్యేస్టేషన్‌లోనూ కలియదిరిగి సంతృప్తి వ్యక్తం చేశారు. తిరుపతిలో స్వచ్ సర్వేక్షన్ కు సహకరించాలని ఆయన విజ్ఞప్తిచేశారు. తడి, పొడి చెత్తలపై దుకాణాదారులకు, ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ప్రజలందరూ అవగాహనతో ఉండి నగరపాలక సంస్థకు సహకరించి స్వచ్ఛ్ సర్వేక్షన్‌లో మొదటి స్థానంలో ఉంచే విధంగా సహకరించాలని ప్రజలను కోరారు.

తిరుపతి బస్టాండ్ లో మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు

ఇదీచూడండి.పోలీసుల వలయంలో తుళ్లూరు... 700 మందితో బందోబస్తు

Intro:తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ను ఆకస్మికతనికి చేపట్టిన మునిసిపల్ కమిషనర్ గిరీషా.Body:Ap_tpt_37_26_bastandu_aakasmika_taniki_av_ap10100

తిరుపతి టెంపుల్ సిటీగా ప్రపంచప్రసిద్ది చెందినందున నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దాలని మునిసిపల్ కమిషనర్ గిరీషా అన్నారు.ఈ రోజు తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ను కలియదిరిగిన ఆయన పారిశుద్యలోపంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బస్టాండ్ లో ఉన్న దుకానదారులు చెత్తబుట్టలు ఏర్పాటు చేయకపోవడంపై వారికి జరిమానాలు విధించారు.అధికారులు మూత్రశాలలు,మరుగుదొడ్లను పర్యవేక్షించక దుర్వాసన వస్తుండడంతో ఆర్టీసీకి పదివేల రూపాయలు జరిమానా విధించారు.
నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలతో పాటుగా జరిమానాలు విధిస్తామని హెచ్చరికలు జారీచేశారు. తిరుపతి రైల్యేస్టేషన్ కూడా కలియదిరిగి సంతృప్తి వ్యక్తం చేశారు. తిరుపతిలో స్వచ్ సర్వేక్షన్ కు సహకరించాలని ఆయన విజ్ఞప్తిచేశారు.తడి,పొడి చెత్తలపై దుకానదారులకు,ఆటోవాళ్లకు అవగాహన కల్పించారు. ప్రజలందరూ అవగాహనతో ఉండి నగరపాలక సంస్థకు సహకరించి స్వచ్ సర్వేక్షన్ లో మొదటి స్థానంలో ఉంచే విధంగా సహకరించాలని ప్రజలను కోరారు.Conclusion:పి.రవికిషోర్,చంద్రగిరి.9985555813.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.