చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎర్రపల్లిలో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన సరస్వతికి దివ్యాంగురాలైన హేమలత అనే కూతురు ఉన్నారు. చిన్నతనం నుంచి కుమార్తెను కంటికి రెప్పలా చూసుకుంటోంది తల్లి. ఏళ్లు గడుస్తున్నా పరిస్థితిలో మార్పు రాకపోవటంతో సరస్వతి వేదనకు గురయ్యారు. ఈ క్రమంలో మంగళవారం తన కూతురు హేమలతకు పురుగుల మందు ఇచ్చి తాను కూడా తాగింది. ఈ సంఘటనలో కూతురు మరణించగా తల్లి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు.
మరోవైపు మదనపల్లి మండలం బసినికొండకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని షాహినా ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: దొంగగా మారిన కానిస్టేబుల్... ఉన్నతాధికారి ఇంటికే కన్నం !