నీటివాగులో గల్లంతై మృతిచెందిన మూడు కుటుంబాలకు.. లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా ప్రకటించారు. చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం కల్లూరు దళితవాడలో మృతుల కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు.
రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యశోద, గంగయ్య, సుజాత కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున సాయం చేయనున్నట్లు ఎమ్మెల్యే రోజా తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు, ట్రస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: